"చుక్కకూర మటన్ కర్రీ" హెల్దీ అండ్ టేస్టీ..!!
కావలసిన పదార్థాలు :లేత పొట్టేలు మాంసం.. ఒక కేజీనూనె.. తగినంతఉల్లిపాయలు.. ఎనిమిదిచుక్కకూర.. రెండు కట్టలువెల్లుల్లి.. 14 రేకలుపచ్చిమిర్చి.. ఎనిమిదియాలకులు.. నాలుగులవంగాలు.. ఐదు దాల్చిన చెక్క.. మూడుఅల్లం.. కాస్తంతపసుపు, ఉప్పు, కారం.. తగినంతధనియాలు.. తగినన్నికొత్తిమీర.. 3 పెద్ద కట్టలుతయారీ విధానం :ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి, కావాల్సిన సైజులో కోసుకోవాలి. యాలకులు, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్కలను కలిపి మెత్తగా నూరుకోవాలి. చుక్కకూరను సన్నగా తరిగి ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా కోసుకోవాలి. అల్లం, వెల్లుల్లిలను మెత్తగా నూరి ఉంచాలి. ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి.అందులో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లను.. ఉప్పు, కారం, పసుపులను వేసి బాగా కలియబెట్టి నీళ్లుపోసి ఉడికించాలి. మాంసం బాగా మెత్తబడేలా ఉడికిన తరువాత పైన చుక్కకూరను చల్లి, బాగా కలిపి ఉడికిన తరువాత దించేయాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే చుక్కకూరతో మటన్ కర్రీ తయార్..!!