చిన్నారుల నోరూరించే "చనా ఖజూర్"
కావలసిన పదార్థాలు :ఖర్జూరాలు... పావు కేజీపంచదార... 75 గ్రా.మంచినీరు... పావు గ్లాసుఛీజ్... 50 గ్రా.చిరోంజి పప్పు... పది గ్రా.జీడిపప్పు... 25 గ్రా.మీగడ... రెండు టీ.చెర్రీపండ్లు... రెండుతయారీ విధానం : ఖర్జూరాల్ని నీళ్లలో ఓ రోజంతా నానబెట్టాలి. ఓ వెడల్పాటి పాన్లో పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. కాస్త చిక్కబడ్డాక చిరోంజి పప్పు, జీడిపప్పు, నానబెట్టి గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి 15 నిమిషాలు మరిగించాలి. తరువాత ముక్కలుగా కోసిన కాటేజ్ ఛీజ్ వేసి బాగా కలిపి దించి మీగడ, చెర్రీలతో అలంకరించాలి. అంతే చనా ఖజూర్ సిద్ధం. ఈ చనా ఖజూర్ పిల్లలకు మంచి పోషకాహారమే కాకుండా, పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు.