Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"చిక్కుళ్ల స్వీట్ కర్రీ" వద్దంటే మిస్సయినట్లే...!

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
చిక్కుడుకాయలు... పావుకిలో
బెల్లంపొడి... అరకప్పు
చింతపండుగుజ్జు... 2 టీస్పూన్లు
పసుపు... చిటికెడు
ఉప్పు... తగినంత
ఎండుమిర్చి...2
జీలకర్ర... అరటీస్పూను
మినప్పప్పు... టీస్పూను
నూనె... 2 టీస్పూన్లు

తయారీ విధానం :
చిక్కుడుకాయలు కడిగి ముక్కలు చేసి ఉప్పు, పసుపు, చింతపండుగుజ్జువేసి ఉడికించి నీళ్లు వంపేసి ఓ పక్క ఉంచాలి. స్టవ్‌మీద మూకుడు పెట్టి నూనె వేసి ఎండుమిర్చి ముక్కలు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించి ఎర్రగా వేగిన తరవాత ఉడికించి ఉంచిన చిక్కుడుకాయ ముక్కలు వేసి పైన బెల్లంపొడి చల్లి బాగా కలపాలి.

బెల్లం వేసిన తరువాత నీరు ఊరుతుంది. ఆ నీరు ఇగిరేంతదాకా స్టవ్‌మీద ఉంచి దించేయాలి. అంతే వేడి వేడిగా, వెరైటీగా ఉండే చిక్కుళ్లతో చేసిన స్వీట్ కర్రీ సిద్ధంగా ఉన్నట్లే.. ఓ పట్టు పట్టేద్దామా..?!

Share this Story:

Follow Webdunia telugu