గంజితో సమ్మర్ స్పెషల్ "లెమన్ డ్రింక్"
కావలసిన పదార్థాలు :అన్నం వార్చిన గంజి... నాలుగు కప్పులునిమ్మకాయలు.. నాలుగుపుదీనా.. ఒక కప్పుబ్లాక్ సాల్ట్.. రెండు టీ.తయారీ విధానం :ముందుగా అన్నం వార్చిన గంజికి రెండు కప్పుల నీటిని చేర్చి పల్చగా తయారు చేయాలి. తరువాత పుదీనాను ముద్దలా నూరి, రసాన్ని గంజిలో పిండాలి. అందులోనే నిమ్మకాయల రసం, బ్లాక్ సాల్ట్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ గంటపాటు ఫ్రిజ్లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత బయటకు తీసి సర్వింగ్ గ్లాసులలోకి ఒంపి, పైన ఐస్ ముక్కల్ని వేసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన లెమన్ డ్రింక్ తయారైనట్లే. ఇది వేసవిలో దాహార్తిని తీర్చటమేగాకుండా, ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.