"ఖజుర్ బహారి" ఘుమఘమలు...!!
కావలసిన పదార్థాలు : కోవా... ఒక కేజీచిక్కటి కొబ్బరిపాలు... అర లీ.బియ్యంపిండి.. నాలుగు టీ.వేయించిన గసగసాలు... వంద గ్రా.ఖర్జూరాలు... తగినన్నితయారీ విధానం : కొబ్బరిపాలలో బియ్యప్పిండి కలిపి స్టవ్‌మీద పెట్టి మరిగించాలి. కోవాను చేతులతో మృదువుగా కలిపి పాలల్లో వేసి కలిపి ఉడికించాలి. మిశ్రమంలో నీరంతా ఆవిరయ్యేవరకూ తిప్పుతూ ఉడికించాలి. చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి.ప్రిజ్‌లోంచి తీశాక.. కోవా మిశ్రమం మధ్యలో గింజలు తీసేసిన ఖర్జూరాల్ని రెండింటి చొప్పున పెట్టి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి. తరువాత ఈ ఉండల్ని గసగసాల్లో దొర్లించితే ఖజుర్ బహారి సిద్ధమైనట్లే...! వెరైటీగా, మంచి రుచితో అలరించే ఖజుర్ బహారీని మీరూ ట్రై చేస్తారు కదూ..!!