"క్యారట్ రైస్"తో పోషకాలు పుష్కలం..!
కావలసిన పదార్థాలు :బియ్యం.. రెండు కప్పులుతురిమిన క్యారట్.. ఒక కప్పునిమ్మకాయ.. ఒకటిపోపు కోసం...ఆవాలు.. అర టీ.జీలకర్ర.. అర టీ.మినప్పప్పు.. అర టీ.జీడిపప్పు.. పదివేరుశెనగపప్పు.. 50 గ్రా.నూనె.. ఒక టీ.పసుపు.. చిటికెడుకరివేపాకు.. రెండు రెమ్మలుఉప్పు.. తగినంతకొత్తిమీర ఆకులు.. కాసిన్నితయారీ విధానం :బియ్యాన్ని కాస్త బిరుసుగా వండి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో క్యారట్ తురుము, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి.. సమంగా పట్టించి పక్కనుంచాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు, జీడిపప్పు, వేరుశెనగపప్పు వేసి.. అవి వేగిన తరువాత పసుపు, జీలకర్ర వేయాలి.చివరగా కరివేపాకు వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా క్యారట్ కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి కలియబెట్టాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే ఎర్రగా, కమ్మగా అలరించే క్యారట్ రైస్ రెడీ...!