కావలసిన పదార్థాలు :
కంది పప్పు: 40 గ్రాములు
క్యాబేజీ: 175 గ్రాములు
నిమ్మకాయ: ఒకటి
జీడిపప్పు: ఐదు
పచ్చిమిరప: ఆరు
అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు: ఒక టీ స్పూన్
ఇంగువ, ఆవాలు: 1/2 టీ స్పూన్లు
నూనె: రెండు టీస్పూన్లు
తయారీ విధానం:
క్యాబేజీని తురుముకొని ఉప్పు నీటిలో ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయల్ని వేయించి కలుపుకోవాలి. ఆవాలు, జీడిపప్పులను బాణలిలో వేయించుకోవాలి. ఉడికించిన క్యాబేజీని వేసి కాస్త నీటిలో మరిగించాలి. బాగా మరిగాక దించుకొని వాటిలో కొత్తిమీర తురుమును నిమ్మకాయ రసాన్ని ఇంగువ నీటిని కలుపుకొని దించుకోవాలి.