కావలసిన పదార్థాలు :
క్యాబేజీ... రెండు
ఉల్లిపాయలు... మూడు
పచ్చిమిర్చి... ఎనిమిది
బఠానీలు.. వంద గ్రాములు
మినపప్పు... 250 గ్రాములు
తయారీ విధానం :
ముందుగా మినపప్పును శుభ్రం చేసుకుని నానబెట్టి గారెలకు తగ్గట్టు రుబ్బుకోవాలి. రుబ్బుకున్న మినపప్పు మిశ్రమంలో తరిగిన క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగుల్ని కలుపుకొని ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడయ్యాక మినపప్పు మిశ్రమంలో కాసింత కాసింత తీసుకుని గారెల్లా తట్టుకుని నూనెలో వేపి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించి దించేసుకోవాలి. ఈ గారెలకు గ్రీన్ చట్నీని సైడిష్‌గా వాడుకోవచ్చు.