కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ: పావుకిలో
మినప్పప్పు: పావుకిలో
ఉల్లిపాయలు: 2
అల్లం: చిన్నముక్క
జీలకర్ర: ఒక చెంచా
నూనె: పావుకిలో
పచ్చిమిర్చి: 6
ఉప్పు: సరిపడా
తయారు చేసే విధానం:
మినపప్పును ఒక గంట ముందు నీళ్లల్లో నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురిమి మినపప్పు ముద్దలో కలపాలి. ఒక బాణాలిలో నూనె పోసి బాగా కాగాక మినపప్పు ముద్దను ఒక ఆకుమీద కొంచెం వేసి వడలా వత్తి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.