కోనసీమ "కొబ్బరి చట్నీ" రుచి చూస్తారా...?!
కావలసిన పదార్థాలు :కొబ్బరి చెక్క... ఒకటికందిపప్పు... ఒక కప్పుఎండుమిర్చి... పదిఆవాలు... ఒక టీ.జీలకర్ర... ఒక టీ.నూనె... రెండు టీ.ఇంగువ, పసుపు... చిటికెడుతయారీ విధానం :కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా కందిపప్పును నూనె లేకుండా బాగా వేయించి, పక్కన పెట్టాలి. ఆ తరువాత నూనె, ఎండుమిర్చి వేసి తాలింపు గింజలను వేయించాలి. మిక్సీలో తాలింపు గింజలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత కందిపప్పును కూడా వేసి మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేయాలి. చివర్లో కొబ్బరి ముక్కలు, ఉప్పు, పసుపు కూడా వేసి మెత్తగా నూరి తీసేయాలి. అంతే కోనసీమ కొబ్బరి చట్నీ సిద్ధమైనట్లే..!