కావలసిన పదార్థాలు :
కొత్తిమీర... రెండు కట్టలు
కారం... రెండు కప్పులు
ఉప్పు... రెండు కప్పులు
మెంతిపొడి.. ఒక టీస్పూన్
నూనె... 300 గ్రాములు
చింతపండు... పావుకేజీ
ఎండుమిరప... తగినన్ని
పోపుగింజలు... తగినన్ని
తయారీ విధానం :
ముందుగా కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు, ఉప్పు వేసి, మునిగేంతదాకా నీటిని పోసి స్టౌమీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత దించి కొంచెం సేపు ఆరనిచ్చి తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని, గ్రేవీని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి, వేడయ్యాక నూనె పోసి, సన్నగా తరిగిన కొత్తిమీరను అందులో వేసి వేయించాలి. తర్వాత ఒక పళ్ళెంలో చింతపండు గ్రేవీ, కారం, వేయించిన కొత్తిమీర మూడింటినీ బాగా కలపాలి. దీంట్లో మెంతిపొడి, ఎండుమిరప, పోపు గింజలతో కలిపి పెట్టుకున్న పోపును కలపాలి. ఆరిన తరువాత పొడిసీసాలో దీన్ని భద్రపరచుకోవాలి. అంతే కొత్తిమీర పచ్చడి సిద్ధమైనట్లే..!