Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరట్ కోకోనట్ ఇడ్లీ

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
ఇడ్లీ రవ్వ... ఒక కప్పు
మినప్పప్పు... పావు కప్పు
ఉప్పు... తగినంత
వంటసోడా... కాస్తంత
కేరట్ తురుము... అరకప్పు
తురిమిన పచ్చికొబ్బరి... అరకప్పు
పచ్చిమిర్చి తరుగు... ఒక టీ.

తయారీ విధానం :
ఇడ్లీ రవ్వను రెండుసార్లు బాగా కడిగి నీరు వంపేసి, తగినన్ని నీళ్లు పోసి ఓ గంటపాటు నానబెట్టాలి. మినప్పప్పును కూడా విడిగా ఓ ఐదు గంటలపాటు నానబెట్టాలి. తరువాత మినప్పప్పును మెత్తగా రుబ్బుకుని అందులో నీరు వంపేసిన ఇడ్లీ రవ్వను కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచితే, తెల్లారేసరికి పిండి పులిసి ఇడ్లీలు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది.

ఇప్పుడు ఈ పిండిలో తగినంత వంటసోడా, ఉప్పును వేసి కలపాలి. తరువాత కేరట్, పచ్చి కొబ్బరి తురుములతో పాటు పచ్చిమిరప తరుగును కూడా వేసి బాగా కలపాలి. ఇడ్లీ పాత్రలతో ఈ మిశ్రమాన్ని ఇడ్లీల్లాగా వేసి, పావు గంట తరువాత తీసి సాంబార్ లేదా చెట్నీలతో కలిపి వడ్డించాలి.

Share this Story:

Follow Webdunia telugu