కాలీఫ్లవర్ స్పెషల్ "దమ్ గోబీ మసాలా"
కావలసిన పదార్థాలు :కాలీఫ్లవర్... ఒకటిపెరుగు... ఒక కప్పుశొంఠిపొడి... అర టీ.ఉల్లిపాయలు... రెండుపచ్చిమిర్చి... నాలుగుకారం... ఒక టీ.పసుపు... పావు టీ.గసాలముద్ద... రెండు టీ.గరంమసాలా... పావు టీ.జీలకర్ర పొడి... ఒక టీ.కొత్తిమీర... ఒక కట్టనూనె... 50 గ్రా.ఉప్పు... తగినంతఅజినమోటో... ఒక టీ.తయారీ విధానం :కాలీఫ్లవర్‌ను ముక్కలుగా కోసి పది నిమిషాలపాటు నీటిలో ఉడికించి తీసి, ఓ వెడల్పాటి గిన్నెలో వేసి ఉంచాలి. ఒక గిన్నెలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, పసుపు, గరంమసాలా, గసాల ముద్ద, జీలకర్ర పొడి, నూనె, ఉప్పు, అజినమోటో అన్నింటినీ వేసి కలిపి ఆ మసాలాను కాలీఫ్లవర్ ముక్కలకు పట్టించి మూతపెట్టి ఉంచాలి.సన్నటి మంటమీద 15 నిమిషాలపాటు ఉడికించి దించేస్తే దమ్ గోబీ మసాల తయారైనట్లే...! ఇది వేడి అన్నం, చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది.