కావలసిన పదార్థాలు :
చిలగడ దుంపలు (స్వీట్ పొటాటో)... మూడు
ఉప్పు... తగినంత
పసుపు... చిటికెడు
చింతపండు గుజ్జు... రెండు టీ.
పచ్చిమిర్చి... మూడు
కరివేపాకు... కొద్దిగా
వెల్లుల్లిరేకలు.... ఆరు
మినప్పప్పు... స్పూను
ఆవాలు... ఒక టీ.
ఎండుమిర్చి... మూడు
నూనె... రెండు టీ.
తయారీ విధానం :
చిలగడ దుంపల చెక్కుతీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించి తీయాలి. మిక్సీలో దుంప ముక్కలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, చింతపండు, వేయించిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బాలి. చివరగా మినప్పప్పు, ఆవాలు, కరివేపాకుతో పోపు పెడితే కమ్మని స్వీట్ పొటాటో చట్నీ రెడీ. ఇది కొబ్బరిచట్నీలాగ మంచి రుచిగా ఉంటుంది.