Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్టా మీఠా పనీర్ టిక్కా

Advertiesment
వంటకాలు భారతీయ కట్టా మీఠా పనీర్ టిక్కా పనీర్ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం పేస్టు ఛాట్ మసాలా కార్న్ఫ్లోర్ ఉప్పు కట్
, గురువారం, 8 జనవరి 2009 (18:07 IST)
FileND
కావలసిన పదార్థాలు :
పనీర్... ముప్పావు కిలో
కొత్తిమీర... వంద గ్రాములు
పచ్చిమిర్చి... 25 గ్రాములు
అల్లం పేస్టు... 10 గ్రాములు
ఛాట్ మసాలా... 5 గ్రాములు
కార్న్‌ఫ్లోర్... 10 గ్రాములు
ఉప్పు... రుచికి సరిపడా

తయారీ విధానం :
పనీర్‌ను దళసరిగా చతురస్త్రాకారంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమామిడి గుజ్జు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు.. అన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. పనీర్ ముక్కలకు చాకుతో గాట్లు పెట్టి అందులోకి ఈ పేస్టును కూరాలి.

పావు వంతు పేస్టును మిగిల్చి ఒక పాత్రలోకి తీసుకుని దాంట్లో అల్లం పేస్టు, ఛాట్ మసాలా, కార్న్‌ఫ్లోర్, కాస్త నూనె కలిపి పనీర్ ముక్కల్ని అందులో వేసి 2 గంటలపాటు ఉంచాలి. తరువాత పనీర్ టిక్కాలని బొగ్గుల పొయ్యిమీదగానీ, గ్రిల్ స్టౌమీదగానీ 8 నిమిషాలపాటు రోస్టులా కాల్చి, వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu