Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎముకల్ని దృఢంగా చేసే "ఆలూపాలక్"

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
పాలకూర.. 5 కట్టలు
బంగాళాదుంపలు.. అర కేజీ
మెంతులు.. పావు టీ.
జీలకర్ర.. అర టీ.
టొమోటో ముక్కలు.. ఒక కప్పు
పసుపు.. పావు టీ.
కారం.. అర టీ.
నూనె.. రెండు టీ.

తయారీ విధానం :
పాలకూరను బాగా కడిగి సన్నగా తరిగి ఉంచాలి. బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి తొక్క తీయకుండానే ముక్కలుగా కోసి నీళ్లలో వేసి ఉడికించాలి. ఆపై పొట్టు తీసి పక్కన ఉంచాలి. ఓ నాన్‌స్టిక్‌ పాన్‌లో మెంతులు, జీలకర్ర, వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, టొమాటోముక్కలు, పాలకూర వేసి మూతపెట్టి 20 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. కొంచెం గ్రేవీ ఉండగానే బంగాళాదుంపముక్కలు వేసి మరో పదినిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే ఆలూ పాలక్ తయార్..!

పాలకూరలో విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. అలాగే ఇందులో 13 యాంటీ ఆక్సిడెంట్‌లున్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్‌ ఏజంట్లుగా పనిచేస్తాయి. కాల్షియం ఎముకలు దృఢంగా తయారవడానికి తోడ్పడుతుంది. విటమిన్‌ సీ, ఏ, మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్‌లు క్యాన్సర్‌ను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu