కావలసిన పదార్థాలు :
కోవా... పావు కేజీ
పంచదార... వంద గ్రా.
ఫుడ్ కలర్... పావు టీ.
ఉసిరికాయల తురుము... అర కప్పు
పంచదార పలుకులు... ఒక టీ.
ఎండుకొబ్బరి... పావు కప్పు
అలంకరణ కోసం పిస్తా పప్పులు... రెండు టీ.
బాదంపప్పు... రెండు టీ.
కుంకుమ పువ్వు... కొద్దిగా
తయారీ విధానం :
కోవా, పంచదార, ఫుడ్‌కలర్‌లను కలపాలి. తరువాత ఉడికించిన ఉసిరితురుమును, పంచదారను కూడా ఇందులో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత సైజులో ఉండలుగా చేసుకుని.. అరచేతిలో కొద్దిగా వత్తి ఎండుకొబ్బరిలో దొర్లించి తీయాలి. తరువాత బాదం, పిస్తా, కుంకుమరేకులతో అలంకరించి వెరైటీ స్వీటుగా అతిథులకు అందించండి.