ఈనెల 25 నుంచి రెసిడెన్సీ మెయిన్‌స్ట్రీట్‌లో ఫుడ్‌ఫెస్టివల్
ఈనెల 25వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు స్థానిక త్యాగరాయ నగర్‌లోని 'ది రెసిడెన్సీ టవర్స్'లో నోరూరించే ఫుడ్‌ఫెస్టివల్ ప్రారంభంకానుంది. ఈ నక్షత్ర హోటల్‌లోని మెయిన్‌స్ట్రీట్‌లో ఈ ఫెస్టివల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్ చేశారు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా పది ఇన్‌కార్నేషన్స్‌తో ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు. నోరూరించే వంటకాలు, కమ్మని రుచులతో పసందైన వంటకాలను ఇందులో చోటు చేసుకోనున్నాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుందని, హోటల్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంతో పాటు.. రాత్రి విందుకు ప్రత్యేక వంటకాలు కొలువుదీరనున్నాయి. మిగిలిన వివరాలు కోసం 2815 6363 అనే ఫోన్ నంబరులో సంప్రదింవచ్చు.