Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లంతో కాకరకాయ పచ్చడి

Advertiesment
అల్లం కాకరకాయ పచ్చడి
, సోమవారం, 19 నవంబరు 2007 (12:41 IST)
కావలసిన పదార్థాలు :
కాకరకాయలు... 1 కిలో
చింతపండు... 1/4 కిలో
ఉప్పు... 1 డబ్బా
కారం... సరిపడా
నూనె... 300 గ్రాములు

తయారీ విధానం :
ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా తరగి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండు, నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఆరిన తరువాత చింతపండుతో పాటు చిన్న చిన్నగా తరిగిన అల్లంముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాండీలో నూనె పోసి కాకరకాయ ముక్కలు వేసి కరకరలాడే వరకు వేయించాలి.

అవి వేగిన తరువాత ఒక పళ్ళెంలో ఈ ముక్కలు, చింతపండు రసం, కారం అన్నీ కలిపాలి. తరువాత ఆ మిగిలిన నూనెలో తాలింపు పెట్టి ఆరిన తరువాత అందులో పోసి కలపాలి. అంతే కాకరకాయ పచ్చడి రెడీ. ఇది బాగా ఆరిన తరువాత డబ్బాలో పోసి ఉంచుకుంటే చాలా రోజుల వరకూ అలాగే నిలువ ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu