Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదిరిపోయే రుచితో "బుట్టా కోఫ్తా కర్రీ"

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న గింజలు... రెండు కప్పులు
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
ఉప్పు... తగినంత
కొత్తిమీర... ఒక కట్ట
పనీర్... 50 గ్రా.
నూనె... సరిపడా

గ్రేవీ తయారీకోసం...
టొమోటో గుజ్జు... రెండు కప్పులు
అల్లంవెల్లుల్లి... ఒక టీ.
పెరుగు... ఒక కప్పు
కారం... ఒకటిన్నర టీ.
గరంమసాలా... చిటికెడు
ఉల్లిపాయలు... రెండు
ధనియాలపొడి... ఒక టీ.
నూనె... నాలుగు టీ.

తయారీ విధానం :
పచ్చిమొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి మెత్తగా ముద్దలా రుబ్బాలి. అందులో తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పనీర్‌ తురుము వేసి ముద్దలా కలిపి పొడవు బజ్జీల్లా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఈ కోఫ్తాల్ని వేసి ఎర్రగా వేయించి తీయాలి.

గ్రేవీ తయారీ చేసేందుకు... బాణలిలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి, కారం, ధనియాలపొడి, వేసి తిప్పాలి. టొమాటోగుజ్జును కొంచెంకొంచెంగా వేసి నూనె తేలేవరకూ గరిటెతో కలియదిప్పాలి. ఆపై పెరుగు కలిపి పది నిమిషాలు ఉడికించి కొత్తిమీర, గరంమసాలా వేసి దించాలి. ఈ గ్రేవీని కోఫ్తాలమీద వేస్తే బుట్టా కోఫ్తా కర్రీ రెడీ..!

Share this Story:

Follow Webdunia telugu