Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెజిటబుల్ ఓట్స్ సూప్ తయారీ ఎలా?

Advertiesment
oats
, మంగళవారం, 29 డిశెంబరు 2015 (15:48 IST)
చలికాలంలో ఆహారం మీద ఆసక్తి తగ్గుతుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపిస్తుంది. అయితే సరిగ్గా
ఆహారం తీసుకోకపోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. దీనికో చక్కని మార్గం సూప్. వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే నీరసం పోతుంది. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. సూప్ ఒత్తిడిని తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. 
 
సూప్‌ని ఏ వేళలోనైనా తీసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల దాకా అందరికి సులువుగా జీర్ణమవుతుంది. అందరూ ఇష్టపడే ఈ వెజిటబుల్ ఓట్స్ సూప్ బరువును తగ్గించడం మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. మరి ఈ హెల్తీ సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం!
 
కావలసిన పదార్ధాలు :
బీన్స్ : 1 
క్యాబేజ్ : 1 
క్యారెట్‌ : 1 
ఓట్స్ : 1 కప్పు
వెన్న : కొద్దిగా
ఉప్పు : రుచికి తగినంత
పుదీనా  : కొద్దిగా
ఉల్లిపాయ : 1 చిన్నది
మిరియాలపొడి: చిటికెడు
కొత్తిమీర : కొద్దిగా
 
తయారీ విధానం:
 
* ముందుగా క్యారెట్‌, బీన్స్, క్యాబేజ్ తీసి చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 
* స్టౌ వెలిగించి పాత్ర పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ముక్కలు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి. 
* తర్వాత స్టౌఆఫ్ చేసి, క్రిందికి దించి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్‌ చేసుకుని వడకట్టుకోవాలి. 
* ఇప్పుడు ఇంకొక పాత్ర‌లో వెన్న వేసి వేడి చేసి ఓట్స్‌ని సన్నని మంట మీద వేయించాలి.
* తర్వాత అందులోనే నీళ్ళు పోసి రెండు-మూడు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. 
* ఓట్స్ ఉడికిన తర్వాత అందులో ముందుగా తయారుచేసి పెట్టుకొన్నవెజిటబుల్ రసం, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి, తగినంత నీరు పోసి మరిగించాలి. అవసరమైతే చిక్కదనం కోసం మొక్కజొన్నపిండిని కలుపుకోవచ్చు. ఇందులో టమోటో లేదా చిల్లీ సాస్‌ కూడా వేసుకోవచ్చు. గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకోవచ్చు. ఈ సూప్‌ని చలికి, ఘాటుఘాటుగా రుచికరంగా తాగేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu