కావలసిన పదార్థాలు:
ఉడికిన కందిపప్పు: 1/2 కప్
ధనియాలు: 1/2 కప్
మిరియాలు: 2 స్పూన్లు
ఎండు మిరపకాయలు: ఆరు
చింతపండు రసం: రెండు గ్లాసులు
నూనె, పోపు: తాలింపుకు తగినంత
టమోటా ముక్కలు: రెండు
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: 1/4 కప్
తయారు చేయండి ఇలా:
బాణలిలో నూనెను పోసి అందులో మిరియాలు, ధనియాలు, ఉడికించిన కందిపప్పులను వేయించి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను చింతపండు రసం, కొత్తిమీర తురుములను చేర్చి కాసేపు మరిగించండి. ఉడికించిన కందిపప్పు బాబా గరిటెతో కలిపి ఈ చింతపండు రసంలో కలపండి. రసం పొంగు వచ్చాక స్టౌవ్ నుంచి దించి పోపు, కొత్తిమీర తరుగులను కలిపి దించేయండి. అంతి రుచికరమైన మైసూర్ రసం రెడీ. దీనిని భోజనం సమయంలోనే కాకుండా సాయంత్రం స్నాక్స్ తిన్న తర్వాత సూప్‌గా కూడా సేవించవచ్చు.