Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోరూరించే ఫిష్ ఫ్రై.. తయారీ ఎలా?

నోరూరించే ఫిష్ ఫ్రై.. తయారీ ఎలా?
, శుక్రవారం, 8 జనవరి 2016 (15:30 IST)
వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి అని అడిగితే అందరు చెప్పే సమాధానం చేప. చేపల్ని ఎక్కువగా తినడం వల్ల ఆడవాళ్లు, మగవాళ్లు డిప్రెషన్‌ రిస్కులో పడరని నిపుణులు అంటున్నారు. చేపల్లో పోషక పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎవరైనా చేపలు ఎక్కువ తింటున్నారని చెపితే వారు ఎంతో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తింటున్నారని అర్థం. 
 
చేపల్లో అనేక ప్రోటీలను, న్యూట్రీషియన్స్, విటమినులు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ 'ఏ' కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ 'ఏ' తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకు దోహపడుతుంది. రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. 
కావలసిన పదార్థాలు:
ముల్లు లేని చేపలు : 2 పెద్దవి 
గుడ్లు : 2 తెల్ల సొన
ధనియాల పొడి : 1 స్పూన్
గరంమసాలా :  1 స్పూన్
అల్లం, వెల్లుల్లి : 1 స్పూన్
నిమ్మరసం : తగినంత
కారం : 2 స్పూన్ 
పసుపు : చిటికెడు
బ్రెడ్‌ పౌడర్‌ : తగినంత
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడా
 
తయారుచేసే విధానం :
ముందుగా చేపను శుభ్రంగా కడిగి.. చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. తర్వాత ఈ ముక్కలకు నిమ్మరసం, ఉప్పు, అల్లంవెల్లుల్లి, పసుపు, ధనియాల పొడి, కారం, గరంమసాలా వేసి బాగా కలియబెట్టాలి. ఈ ముక్కలను ఫ్రిజ్‌లో అరగంట ఉంచాలి. ఇప్పుడు గుడ్లను గిలకొట్టి ముక్కల్ని ముంచి, బ్రెడ్‌ పౌడర్లో దొర్లించి నూనెలో దోరగా వేగించాలి. అంతే నోరూరించే ఫిష్ ఫ్రై రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu