Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వీట్ పొటాటోతో జామూన్

Advertiesment
గులాబ్ జామూన్‌ చక్కెర పాకం తయారు  తర్వాత మైదా  చిలకడదుంప ముక్కలు ఏలకుల పొడి నెయ్యి చిటికెడు పాలు పోసి కలిపి సైజులో  ఉండలు చేసుకోవాలి.
, సోమవారం, 24 మార్చి 2008 (12:13 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
స్వీట్ పొటాటో(చిలకడదుంప) ఉడికించి సన్నగా తరిగినది - రెండు కప్పులు, మైదా పిండి - ఐదు చెంచాలు, చక్కెర - రెండు కప్పులు, వాసన కోసం ఏలకుల పొడి - చెంచా, వేయించడానికి నూనె - మీకు కావలసినంత, నెయ్యి - ఒకటిన్నర కప్పు.

తయారు చేయు విధానం :
ముందుగా గులాబ్ జామూన్‌కు తయారు చేసేలా చక్కెర పాకాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత మైదాను తీసుకుని చిలకడదుంపల ముక్కల్లో కలిపి ఇందులో ఏలకుల పొడి కాస్త నెయ్యి, చిటికెడు పాలు పోసి కలిపి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి.

వీడిని నూనె లేదా నెయ్యిలో బంగారు రంగు వన్నె వచ్చేంత వరకు వేయించి దించి చక్కెర పాకంలో వేసి అరగంట పాటు ఉంచాలి. బాల్స్ పాకంలో మునిగేలా చాడాలి. తర్వాత అతిధులకు ర్వ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu