సమ్మర్ స్పెషల్ విత్ టేస్టీ "ట్రిపుల్ మ్యాజిక్ డ్రింక్"
కావలసిన పదార్థాలు :చెరకు రసం.. రెండు కప్పులుఅల్లం రసం.. నాలుగు టీ.తియ్యని కమలాఫలం జ్యూస్.. అర కప్పుజల్జీరా మసాలా.. రెండు టీ.చితక్కొట్టిన ఐస్ ముక్కలు.. ఒక కప్పుతయారీ విధానం :ఒక పొడవాటి సర్వింగ్ గ్లాసును తీసుకుని అందులో చితక్కొట్టిన ఐస్ ముక్కలు, కమలాఫలం జ్యూస్ వేసి బాగా కలియబెట్టాలి. వేరొక పాత్రలో చెరకు రసం, అల్లం రసం, జల్జీరా మసాలా కూడా వేసి బాగా షేక్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కమలాఫలం జ్యూస్ ఉన్న గ్లాసులో పోసి వెంటనే సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన సమ్మర్ స్పెషల్ "ట్రిపుల్ మ్యాజిక్ డ్రింక్" తయార్. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి..!!