Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనగపప్పు-క్యారెట్ కూర

Advertiesment
వంటకాలు భారతీయ క్యారెట్ ఎండుమిర్చి శనగపప్పు ఎండుకొబ్బరి పసుపు ఉప్పు కూర సైజు అంగుళం
, బుధవారం, 18 ఫిబ్రవరి 2009 (18:39 IST)
కావలసిన పదార్థాలు :
క్యారెట్లు‌... పావు కేజీ
ఎండుమిర్చి... 8 కాయలు
వేయించిన శనగపప్పు... 2 టేబుల్‌ స్పూన్లు
ఎండుకొబ్బరి... కొద్దిగా
ఉప్పు... తగినంత
పసుపు... కూరకు సరిపడా
నూనె... నాలుగు టీస్పూన్లు
జీలకర్ర, ఆవాలు, కరివేపాకు... పోపుకు సరిపడా

తయారీ విధానం :
అంగుళం సైజు ముక్కలుగా తరిగి ఉంచుకున్న క్యారెట్‌ ముక్కలను నీటితో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలను వేయించి... వేయించి శనగపప్పు, ఎండుకొబ్బరి, ఉప్పు, పసుపులతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పై ఫ్రైయింగ్ పాన్ పెట్టి.. 4 టీస్పూన్ల నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఇప్పుడు అందులోనే తరిగి ఉంచుకున్న క్యారెట్ ముక్కలను వేసి వేయించాలి. ఐదు నిమిషాల తరువాత పొడి చేసి ఉంచిన మిశ్రమాన్ని వేసి సన్నటి మంటమీద మరో ఐదు నిమిషాల పాటు వేయించి దించేయాలి.

అవసరమైతే పైన కొత్తిమీర తరుగు చల్లుకోవచ్చు. అంతే శనగపప్పుతో క్యారెట్ కూర రెడీ అయినట్లే..! దీన్ని వేడి వేడి అన్నం, చపాతీలలోకి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu