Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెల్లుల్లి ఆవకాయ

Advertiesment
వెల్లుల్లి ఆవకాయ మెంతులు జీలకర్ర

Ganesh

, గురువారం, 10 జులై 2008 (16:38 IST)
WD
కావలసిన పదార్థాలు :
తెల్ల వెల్లుల్లి తొక్కు తీసినవి... 4 కప్పులు
ఉప్పు పొడి... 1 కప్పు
మిరప పొడి... 1 కప్పు
మెంతులు... గరిటెడు
జీలకర్ర... గరిటెడు
దనియాలు... ఒకటిన్నర గరిటెడు
ఇంగువ పొడి... 2 చిటికెలు
ఆవాలు... గరిటెడు
మంచి నూనె... 1 కప్పు
నిమ్మపండు రసం... 1 కప్పు
తురిమిన బెల్లం... సరిపడా

తయారీ విధానం :
ముందుగా మెంతులు, జీలకర్ర, దనియాలను వేరు వేరుగా బాణలిలో వేయించి ఒకటిగా చేర్చి పొడి చేసుకోవాలి. నిమ్మపండ్లు కోసి రసం పిండి కొలిచి ఉంచుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లిని కుక్కలో ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత పొయ్యిమీద బాణలిని ఉంచి నూనె వేసి, అందులో ఆవాలు, ఇంగువ పొడి, వెల్లుల్లిని చేర్చి వెంటనే పొయ్యిని ఆర్పివేయాలి.

అందులోనే ఉప్పు, మిరప పొడి, మెంతులు, జీలకర్ర, దనియాల పొడిని కూడా చేర్చుకోవాలి. దీనికి నిమ్మరసం చేర్చి, నచ్చిన వారు బెల్లం తురుమును కూడా చేర్చి బాగా కలిపి ఊరగాయ జాడీలో వేసి గుడ్డతో మూత పెట్టాలి. అంతే... వెల్లుల్లి ఆవకాయ రెడీ. దీనిని రెండు రోజులపాటు ఉండనిచ్చి, ఆపై తింటే బాగా రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu