Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుచికరమైన "కాకరకాయ మసాలా"

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
కాకరకాయలు... ఎనిమిది
ఉల్లిపాయలు.. మూడు
కారం... రెండు టీ.
ధనియాలపొడి... ఒక టీ.
జీలకర్ర.. ఒక టీ.
పసుపు... అర టీ.
ఉప్పు, నూనె... తగినంత

తయారీ విధానం :
పీలర్‌తో కాకరకాయలకు తొక్కును కొద్దిగా తీసివేయాలి. మరీ లోతుగా చెక్కకుండా పైపైనే తీసివేయాలి. కాకరకాయల మధ్యలో పొడవుగా గాటుపెట్టి, లోపలి గింజలను తీయాలి. వీటికి ఉప్పు, పసుపు పట్టించి.. ఓ గంటపాటు ఊరబెట్టాలి. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి.. కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల మధ్యలో కూరి బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే కాకరకాయ మసాలా సిద్ధమైనట్లే..!

Share this Story:

Follow Webdunia telugu