"రసవాంగి కూటు"తో అవుతారు ఫ్లాట్..!!
కావలసిన పదార్థాలు :వంకాయలు లేదా తెల్లగుమ్మడి ముక్కలు.. 8 కప్పులుకందిపప్పు.. ఒక కప్పుచింతపండు... రెండు నిమ్మకాయలంతపుట్నాలపప్పు.. 8 టీ.ఉప్పు... సరిపడాఇంగువ.. కాస్తంతపసుపు.. చిటికెడురసంపొడి.. రెండు టీ.బెల్లం... చిన్న ముక్కమసాలా కోసం...ధనియాలు.. 8 టీ.కొబ్బరి తురుము... 8 టీ.ఎండుమిర్చి.. నాలుగుబియ్యం... 2 టీ.తాలింపు కోసం...ఆవాలు... 2 టీ.కరివేపాకు.. 8 రెమ్మలునూనె.. 4 టీ.తయారీ విధానం:మసాలాకోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేయించి చల్లార్చి పొడి చేయాలి. కడాయిలో నూనె వేసి సెనగపప్పు వేసి వేగాక ఆవాలు కరివేపాకు వేయాలి. తరువాత వంకాయ ముక్కలు వేయాలి. కాసేపు ముక్కలు వేగాక పసుపు, ఇంగువ, ఉప్పు, చింతపండుగుజ్జు, రసంపొడి, వేయించిన శెనగపప్పు వేసి, ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి.ఆపై మసాలా పొడి చల్లి ఉడికించిన కందిపప్పు, బెల్లం తురుము కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించి దించేయాలి. అంతే రసవాంగి కూటు తయారైనట్లే...!