Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముల్లంగి వేపుడు

ముల్లంగి వేపుడు
, శుక్రవారం, 1 ఆగస్టు 2008 (17:57 IST)
కావలసిన పదార్థాలు :
ముల్లంగి... ఐదు
కారం... మూడు టీ స్పూన్లు
ఉప్పు... సరిపడా
నూనె... తాలింపుకు సరిపడా
ధనియాలపొడి... ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి... ఒక టీ స్పూన్

తయారీ విధానం :
ముందుగా ముల్లంగి దుంపలను పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి. తర్వాత ముల్లంగి ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి నూనె వేడయ్యాక, ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటలో బాగా వేయించాలి. తరువాత ఈ ముక్కలకు తగినంత ఉప్పు కలిపి వేయించాలి.

ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక నూనె ఎక్కువగా ఉంటే వంపి కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కాసేపు వేయించి దించాలి. అంతే ముల్లంగి వేపుడు రెడీ. దీనిని పొడి పొడిగా ఉండే రైస్‌కు సైడ్‌డిష్‌గా వాడుకుంటే రుచికరంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu