Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరమరాలతో ఫ్రూట్ భేల్

Advertiesment
వంటకాలు భారతీయం మరమరాలు శెనగపిండి నూనె జీలకర్ర ఇంగువ పసుపు పెసలు టొమోటో యాపిల్ కమలా కొత్తిమీర
కావలసిన పదార్థాలు :
మరమరాలు... మూడు కప్పులు
శెనగపిండి... ఒకటిన్నర టీ.
నూనె... ఒక టీ.
జీలకర్ర... ఒక టీ.
ఇంగువ... చిటికెడు
పసుపు... పావు టీ.
మొలకెత్తిన పెసలు... అర కప్పు
టొమోటో ముక్కలు... ఒక కప్పు
యాపిల్ ముక్కలు... ఒక కప్పు
పచ్చిమామిడికాయ ముక్కలు... రెండు టీ.
కమలా తొనలు... అర కప్పు
కొత్తిమీర... పావు కప్పు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
బాణలిలో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర వేయాలి. అది చిటపటలాడాక ఇంగువ, పసుపు, మరమరాలు వేసి బాగా కలపాలి. శెనగపిండి కూడా ఇందులో వేసి కాసేపు వేయించి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పైన చెప్పుకున్న మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెట్టి సర్వ్ చేయాలి. అంతే మరమరాల ఫ్రూట్ భేల్ సిద్ధమైనట్లే...! సాయంత్రపు సమయాల్లో స్నాక్స్‌లాగా దీనిని తీసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu