కావలసిన పదార్థాలు :
బూడిద గుమ్మడి... వంద గ్రా.
గుమ్మడి... వంద గ్రా.
పచ్చిమిర్చి... నాలుగు
కందిపప్పు... ఒక టీ.
చిక్కటి కొబ్బరిపాలు... పావు కప్పు
ఉప్పు... తగినంత
కొబ్బరినూనె... ఒక టీ.
కొబ్బరిపాలు... ఒక కప్పు
కరివేపాకు... ఒక రెమ్మ
తయారీ విధానం :
బూడిదగుమ్మడి, గుమ్మడి కాయల తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఈ ముక్కల్ని కందిపప్పుతో సహా ఉడికించాలి. తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు కూడా జోడించాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత కప్పు కొబ్బరిపాలు పోసి మరిగించాలి. ముక్కలు దగ్గరగా ఉడికిన తరవాత పావుకప్పు చిక్కటి కొబ్బరిపాలు కూడా పోసి మరిగించి దించాలి. చివరగా కూరకి పోపుపెడితే... గుమ్మడి ఓలన్ రెడీ అయినట్లే...!