Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"పొట్లకాయ పెరుగు పచ్చడి"తో వాతానికి చెక్..!

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
పొట్లకాయ.. ఒకటి
పసుపు.. కొద్దిగా
పచ్చిమిర్చి.. నాలుగు
ఉప్పు.. తగినంత
తియ్యటి పెరుగు.. మూడు కప్పులు
జీలకర్ర, ఆవాలు... పోపుకు సరిపడా
నెయ్యి.. ఒక టీ.
ఎండుమిర్చి, కరివేపాకు.. తగినంత
కొత్తిమీర.. అర కప్పు

తయారీ విధానం :
పొట్లకాయను బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి వుంచుకోవాలి. పొయ్యిమీద మూకుడు పెట్టి అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల (పొట్లకాయ సైజును బట్టి) నెయ్యి వేసి పొట్లకాయ ముక్కలు అందులో వేయించి వుంచుకోవాలి. తర్వాత మూకుడులో నెయ్యి వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు కలిపి వేయించాలి.

ఇది బాగా వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో వేయాలి. దాంట్లోనే పెరుగు వేసి పసుపు, ఉప్పు అవసరమైనంతగా కలిపి బాగా కలియ బెట్టాలి. ఇందులో పోపు, కొత్తిమీర, పొట్లకాయ ముక్కలు కలిపి మూత పెట్టాలి. కనీసం మూడు గంటలున్న తరువాత ఈ పచ్చడి వేసుకుంటే తించే చాలా రుచిగా వుంటుంది. పొట్లకాయ వాతాన్ని పోగొడుతుంది. పథ్యం తినేవారికి ఇది చాలా మంచిది. తేలికగా జీర్ణం అయ్యే పొట్లకాయలో పీచు పదార్థం ఎక్కువగా వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu