Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టగొడుగుల సలాడ్

Advertiesment
వంటకాలు భారతీయ పుట్టగొడుగులు వెనిగర్ క్యాబేజీ సలాడ్ ఆయిల్ పెసర మొలకలు ఉప్పు కేరట్ మిరియాలు పుట్టగొడుగుల సలాడ్
, గురువారం, 8 జనవరి 2009 (18:05 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు... వంద గ్రాములు
వెనిగర్... ఒక టీస్పూన్
క్యాబేజీ... ఒక కప్పు
సలాడ్ ఆయిల్... ఒక టీస్పూన్
పెసర మొలకలు... ఒక కప్పు
ఉప్పు.. తగినంత
తరిగిన కేరట్... ఒక కప్పు
మిరియాలు... అర టీస్పూన్

తయారీ విధానం :
పుట్టగొడుగులు నాలుగు ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఉప్పు నీటిలో మూడు లేదా నాలుగు నిమిషాలపాటు వీటిని ఉడికించాలి. పైన చెప్పిన క్యాబేజీ, పెసర మొలకలు, కేరట్‌లను ఉప్పునీటిలో వేసి ఉంచాలి. ఓ అరగంటపాటు అలాగే ఉంచిన తరువాత నీటిని వంపేయాలి.

ఇప్పుడు పుట్టగొడుగులకు క్యాబేజీ, పెసర, కేరట్‌ తరుగు కలిపి సర్వింగ్ డిష్‌లో వేయాలి. తరువాత దీంట్లోనే సలాడ్ ఆయిల్, సగం బద్ధలు కొట్టిన మిరియాలు, సరిపడా ఉప్పు వేసి బాగా కలియబెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. కాసేపు అది చల్లబడిన తరువాత తీసి సర్వ్ చేయాలి. అంతే పుట్టగొడుగుల సలాడ్ తయారయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu