కావలసిన పదార్థాలు :
బచ్చలికూర... 4 కట్టలు
ఉల్లిపాయలు... నాలుగు
బంగాళాదుంపలు... ఆరు
బ్రెడ్... 5 పీసులు
పాలు... ఒకటింపావు కప్పు
అల్లం... ఒక అంగుళం ముక్క
గరంమసాలా... ఒక టీస్పూను
నూనె... 2 గరిటెలు
డాల్డా... 3 టీస్పూన్లు
కారం... ఒక టీస్పూను
ఉప్పు, పసుపు... సరిపడా
తయారీ విధానం :
బంగాళాదుంపలను ఉడికించి తోలు తీసి మెత్తగా చేసుకొని ఉంచాలి. దీనికి నీటిలో ముంచి తీసి పిండేసిన బ్రెడ్ ముక్కలు, ఉల్లి, మిర్చి ముక్కలు, కొత్తిమీర, గరంమసాలా, ఉప్పు, మామిడికాయ పొడి, బచ్చలికూర కొంచెం వేసి కలిపి ముద్ద చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని కోఫ్తాలలాగా తయారు చేసి పక్కన ఉంచాలి.
గ్రేవీకోసంగాను ఉల్లిపాయలు, బచ్చలి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీలో కొంచెం నూనె వేసి కాగిన తరువాత బచ్చలికూరను వేసి దానికి కొంచెం పంచదార కలిపి ఉడికించుకోవాలి. పంచదార వల్ల కూర రంగు మారదు. ఉడికిన తరువాత దింపి పేస్ట్‌లా చేసుకోవాలి.
బాండీలో 2 గరిటెల నూనె వేసి కాగిన తరువాత ఉల్లి ముక్కలు, మెత్తగా నూరిన అల్లం వేసి దాంట్లో బచ్చలి పేస్టు, పాలు, ఉప్పు, మామిడికాయ పొడి, గరంమసాలా, పసుపు, కారం వేసి గట్టిపడేంతవరకు ఉడికించి... దించే ముందు కోఫ్తాలను కలిపి వేడి వేడిగా వడ్డించాలి.