Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనీర్‌ టొమోటో షషిలిక్

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
పనీర్... పావు కేజీ
క్యాప్సికమ్... ఐదు
ఉల్లిపాయలు... మూడు
టొమోటోలు... ఐదు
గడ్డపెరుగు... ఒకటిన్నర కప్పు
జీలకర్ర పొడి... అర టీ.
కారం... అర టీ.
ఛాట్ మసాలా... అర టీ.
ఉప్పు... తగినంత
నిమ్మరసం... ఐదు టీ.
ఆరెంజ్ ఫుడ్ కలర్... చిటికెడు
అల్లం రసం... మూడు టీ.

తయారీ విధానం :
పనీర్‌ను అర అంగుళం మందం, ఒకటిన్నర అంగుళాల చదరపు ముక్కలుగా కోయాలి. వీటికి ఉప్పు, నిమ్మరసం పూసి పెట్టాలి. పెరుగును వడకట్టి చిక్కని ముద్దలా చేసి అందులో కారం, అల్లం రసం, ఉప్పు, నిమ్మరసం, జీలకర్రపొడి, చాట్‌మసాలా, రంగు కలిపి ఉంచాలి.

క్యాప్సికమ్‌, ఉల్లిపాయలు, టొమాటోలు కూడా పనీర్‌ మాదిరిగానే చదరపు ముక్కలుగానే కోయాలి. పెరుగు మసాలాను పనీర్‌, కాయగూరల ముక్కలకు పట్టించి వీటన్నింటినీ సన్నని చువ్వలకు గుచ్చి మంటమీద అటూ ఇటూ కాల్చి తీస్తే కబాబ్‌ల మాదిరిగా ఉంటాయి. అంతే పనీర్‌ టొమోటో షషిలిక్ సిద్ధమైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu