Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంజాబీ చెన్నా మసాలా

పంజాబీ చెన్నా మసాలా
, గురువారం, 7 ఆగస్టు 2008 (16:55 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
తెల్ల శెనగలు... మూడు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు... రెండు కప్పులు
టొమోటోలు... నాలుగు
వెల్లుల్లి... 15 రేకలు
పచ్చిమిర్చి... మూడు (పొడవుగా సన్నగా తరగినవి)
అల్లం... ఒక టీస్పూన్ (సన్నగా కత్తిరించినది)
నెయ్యి... నాలుగు టీస్పూన్లు
ధనియాలపొడి... ఒక టీస్పూన్
కారం... ఒక టీస్పూన్
ఎండబెట్టిన మామిడిపొడి... ఒక టీస్పూన్

తయారీ విధానం :
ముందురోజు రాత్రి శెనగల్ని నీటిలో నానబెట్టుకోవాలి. నానిన శెనగలను ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిలను పేస్ట్ చేసుకోవాలి. టొమోటోలను వేడినీటిలో ఉడికించి తోలుతీసి గుజ్జు చేసి ఉంచాలి.

బాణలిలో నెయ్యిపోసి కాగిన తరువాత రుబ్బి ఉంచుకున్న మసాలా ముద్దను వేసి వేయించాలి. నెయ్యి పైకి తేలిన తరువాత టొమోటో గుజ్జు వేసి కొంచెంసేపు కలియబెట్టి... అల్లం, ఉడికించి ఉంచిన శెనగలు వేసి, తగినన్ని నీరు పోసి సన్నటి సెగమీద ఉడికించాలి. తరువాత దీనికి కారం, ధనియాలపొడి, ఉప్పు, పసుపు, మామిడికాయ పొడి, పచ్చిమిర్చి కూడా కలిపి ఉడికించాలి.

చివరగా, కూర చిక్కబడిన తరువాత కొత్తిమీర చల్లి దించుకోవాలి. ఈ కూరను ఉల్లిముక్కలమీద నిమ్మరసం, మిరియాలపొడి చల్లి పూరీలలోకి, చపాతీలలోకి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu