Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోరూరించే ఉసిరికాయ పప్పు

Advertiesment
వంటకాలు భారతీయ ఉసిరికాయ పప్పు ఎండుమిర్చి ఉప్పు నూనె పచ్చిమిర్చి వెల్లుల్లి కారం ఆవాలు జీలకర్ర
కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు... ఆరు
కందిపప్పు... చిన్నకప్పు
ఎండుమిర్చి... నాలుగు
ఆవాలు... పావుటీస్పూను
జీలకర్ర... పావుటీస్పూను
కారం... అరటీస్పూను
పసుపు... పావుటీస్పూను
కరివేపాకు... ఒక రెమ్మ
ఉప్పు... తగినంత
నూనె... 3 టీస్పూన్లు
వెల్లుల్లి... 5 రెబ్బలు...
ఉల్లిపాయ... ఒకటి
పచ్చిమిర్చి... నాలుగు

తయారీ విధానం :
కందిపప్పులో కొంచెం పసుపు, నూనె, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉసిరికాయల్ని ముక్కలుగా వేసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన ఈ ముక్కల్ని పప్పులో వేసి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించి, ఉప్పు వేసి దించేయాలి.

తరువాత కడాయిలో కాస్తంత నూనె పోసి.... ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కారం మొదలైన తాలింపు దినుసులన్నింటినీ వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించి పప్పులో కలపాలి. అంతే నోరూరించే ఉసిరికాయ పప్పు రెడీ అయినట్లే..! ఇది వేడి వేడి అన్నం, చపాతీలు, దోశెల్లోకి చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu