"టొమోటో ముస్సలం" ఓ పట్టు పట్టేద్దామా...?
కావలసిన పదార్థాలు :బెంగళూరు టొమోటోలు.. పదిదేశవాళీ టొమోటోల గుజ్జు... నాలుగు కప్పులుఉల్లిపాయముద్ద... ఒక కప్పుకారం... రెండు టీ.పసుపు... ఒక టీ.అల్లంవెల్లుల్లి... రెండు టీ.జీడిపప్పుముద్ద... అర కప్పుకసూరిమేతి.. రెండు టీ.నూనె... అర కప్పుఉప్పు... తగినంతగరంమసాలా... అర టీ.పెరుగు... ఒక కప్పుతయారీ విధానం :ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి బెంగళూరు టొమోటో (కాయ మొత్తాన్ని)లను వేసి రెండువైపులా వేయించి తీసేయాలి. ఇప్పుడు ఆ టొమోటోలకు తొక్క తీసి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిముద్ద వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలియబెట్టాలి. టొమోటో గుజ్జును కూడా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా వేయించాలి.ఇప్పుడు అందులోనే పెరుగు, తగినన్ని నీళ్లుపోసి పచ్చివాసన పోయేంతదాకా ఉడికించాలి. దాంట్లోనే జీడిముద్దను కూడా వేసి ఉడికించాలి. చివరగా బెంగళూరు టొమోటోలను, కసూరిమేతిని వేసి కలియబెట్టి, గరంమసాలా చల్లి, ఉప్పు సరిజూసి... కాసేపటి తరువాత దించేయాలి. అంతే టొమోటో ముస్సలం తయారైనట్లే...!