కావలసిన పదార్థాలు :
మునక్కాయలు... రెండు
టొమోటోలు... ఆరు
ఉల్లిపాయ... ఒకటి
కారం... రెండు టీ.
అల్లం వెల్లుల్లి పేస్ట్... ఒక టీ.
గరంమసాలా పౌడర్... ఒక టీ.
కొత్తిమీర... ఒక చిన్న కట్ట
నూనె... రెండు టీ.
తయారీ విధానం :
ముందుగా బాణలిలో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులను వేసి కాసేపటి తరువాత ఉల్లిపాయ ముక్కలను వేయాలి. అవి కొంచెం మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, టొమోటో ముక్కలు వేసి మూత పెట్టాలి. వాటిని సన్నటి మంటమీద మగ్గనిచ్చి, మునక్కాయ ముక్కలు వేసి కలిపి అలాగే ఉడికించాలి.
దీనికి నీరు పోయాల్సిన అవసరం లేదు. టొమోటోలలో ఉన్న తేమతోనే ములక్కాడలు ఉడుకుతాయి. సన్నటి మంటమీద ఉడికిస్తే సరిపోతుంది. చివర్లో గరంమసాలా పౌడర్ వేసి, దించాక కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వడ్డించాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి చక్కటి కాంబినేషన్.