చికెన్ ఫ్రై విత్ ఆలీవ్ ఆయిల్
కావలసిన పదార్థాలు :చికెన్.. అర కేజీఆలీవ్ ఆయిల్.. తగినంతటొమోటోలు.. వంద గ్రా.కారంపొడి.. ఒక టీ.ఉప్పు.. తగినంతపసుపు.. ఒక టీ.అల్లంవెల్లుల్లి ముద్ద.. రెండు టీ.షాజీరా పొడి.. ఒక టీ.ధనియాలపొడి.. ఒక టీ.కొత్తిమీర.. ఒక కట్టకరివేపాకు.. కొద్దిగాలవంగంపొడి.. ఒక టీ.యాలకులపొడి.. ఒక టీ.దాల్చినచెక్కపొడి.. ఒక టీ.మొగ్గపొడి.. ఒక టీ.మరాటి మొగ్గ పొడి.. ఒక టీ.గసగసాలు, కొబ్బరిపేస్టు.. ఒక టీ.ఉల్లిపాయలు.. 50 గ్రా.తయారీ విధానం :ముందుగా చికెన్‌ను శుభ్రం చేసి అందులో ఉప్పు, పసుపు, కారం, కాస్తంత పెరుగును కూడా వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కనుంచాలి. ఆపై కాసేపు ఉడికించి ఉంచాలి. ఒక గిన్నెలో ఆలీవ్ ఆయిల్ వేసి కాగిన తరువాత టొమోటో, ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. ఆపై అల్లంవెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ముందు చికెన్‌ని ఉడికించేటప్పుడు కారం, ఉప్పు వేశాం కాబట్టి, ఇప్పుడు కొద్దిగా వేస్తే సరిపోతుంది.మసాలా పొడులు, కొబ్బరి గసగసాల ముద్దను కూడా ఇందులో వేసి వేయించాలి. చివర్లో ఉడికించిన చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి, మూతపెట్టి 10 నిమిషాలపాటు మగ్గనివ్వాలి. ముక్క ఉడికిన తరువాత దించేముందుగా ధనియాలపొడి వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు, కరివేపాకును చల్లి దించేస్తే చికెన్ ఫ్రై విత్ ఆలీవ్ ఆయిల్ సిద్ధమైనట్లే..!