చాపలా చుట్టేస్తే.. "బఖార్ వడి" రెడీ..!!
కావలసిన పదార్థాలు :బంగాళాదుంపలు.. అర కేజీమిరియాలపొడి.. అర టీ.దాల్చినచెక్క.. అర టీ.సోంపు.. ఒక టీ.నూనె.. తగినంతకొత్తిమీర.. 2 కట్టలుపచ్చిమిర్చి.. 6అల్లం.. కాస్తంతనిమ్మకాయ.. ఒకటిఇంగువ.. చిటికెడుకొబ్బరితురుము.. పావు కప్పులవంగాలు.. 5నువ్వులు.. 1 టీ.పంచదార.. 2 టీ.ఉప్ప.. తగినంతశెనగపిండి.. 75 గ్రా.గోధుమపిండి.. పావు కేజీతయారీ విధానం :బంగాళాదుంపల తొక్కుతీసి కట్ చేసుకోవాలి. నూనె వేడిచేసి ఇంగువ వేసి బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించాలి. వాటిని చల్లార్చి సోంపు, పంచదార, ఉప్పు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి, నిమ్మరసం, కొబ్బరి తురుము, లవంగాలు, నువ్వులు వేసి కలిపి ముద్దలా చేసి పక్కన ఉంచాలి.శెనగపిండి, గోధుమపిండిలను కలిపి, రెండు టీస్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా చేయాలి. దీనిని రెండు సమాన భాగాలుగా చేసి.. చపాతీల్లాగా వత్తాలి. ఈ చపాతీల మీద బంగాళాదుంప మిశ్రమాన్ని పరచి చాపలా చుట్టి, అంచుల్ని తడిచేసి అతికించాలి. వీటిని ముక్కలుగా కోసి నూనె నూనెలో వేయిస్తే బఖార్ పడీ సిద్ధమైనట్లే..!