Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్‌ మ్యాంగో పుదీనా జ్యూస్‌

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
పచ్చిమామిడికాయలు... ఆరు
పుదీనా ఆకులు... పావు కప్పు
మంచినీళ్లు... నాలుగు కప్పులు
జీలకర్ర... ఒక టీ.
కారం... అర టీ.
ఉప్పు... ఒక టీ.
పంచదార... మూడు టీ.
ఐస్‌క్యూబ్స్... తగినన్ని

తయారీ విధానం :
ఒక పాత్రలో మామిడికాయలు మునిగేంతగా నీటిని పోసి ఉడికించాలి. నీళ్లు చల్లబడ్డాక ఉడికిన మామిడికాయల పై తొక్క తొలగించి స్పూన్‌తో గుజ్జునంతా ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీంట్లోనే నాలుగు కప్పుల మంచినీళ్లు, పంచదార, ఉప్పు, కారం, జీలకర్ర వేసి కలపాలి. ఆ తరువాత పుదీనా ఆకులను బాగా కలిపి గ్లాస్‌లో పోయాలి. ఐస్‌క్యూబ్స్‌ను క్రష్ చేసి గ్లాసుల్లో వేసి చల్ల చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu