కావలసిన పదార్థాలు :
తాజా గులాబీ రేకులు... రెండు కప్పులు
వేడినీరు... ఒక కప్పు
యాలకుల గింజలు... అర టీ.
పంచదార... ఒక కప్పు
నిమ్మరసం... అర కప్పు
దానిమ్మ రసం... ఒక కప్పు
చల్లటి నీరు... ఆరు కప్పులు
తయారీ విధానం :
గులాబీ రేకులను రోట్లో వేసి చిదమాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి వేడినీరు పోయాలి. అందులో యాలకుల గింజలు వేసి, గిన్నెపై మూతపెట్టి ఓ రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. దీంట్లోనే పంచదార వేసి ఈ పాత్రని వేడినీరు ఉన్న మరో వెడల్పాటి పాత్రలో పెట్టి పంచదార కరిగేంతదాకా ఉంచాలి. పంచదార కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని మళ్లీ వడగట్టాలి.
చల్లారిన తరువాత ఈ మిశ్రమంలో నిమ్మ, దానిమ్మ రసం కలిపి గ్లాసుల్లో పోయాలి. ఐస్‌క్యూబ్స్‌ని క్రష్ చేసి వేసి అతిథులకు సర్వ్ చేయాలి. వేసవి తాపం నుంచి కాపాడే ఈ షర్బత్‌ను ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని, కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు. మరి మీరు కూడా తయారు చేసుకుంటారు కదూ...!!