రుబ్బుకున్న పదార్థానికి కారంపొడి, ధనియాలపొడి, పసుపుపొడి, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మసాలా ముద్దను కోసి ఉంచుకున్న వంకాయలలో బాగా కూరాలి. ఇలా మొత్తం కాయలకు మసాలాముద్దను పట్టించిన తరువాత పావు గంటసేపు ఊరనివ్వాలి.
తరువాత బాణలిలో సరిపడా నూనెను వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులతో పోపు పెట్టుకుని అందులోనే కరివేపాకు, కొత్తిమీర, నిలువుగా కోసుకున్న ఉల్లిపాయలు, రెండుగా కోసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత వంకాయలను వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్న క్రమంలోనే వంకాలపై ముక్కలుగా కోసుకున్న టొమోటోలను వేసి ఆవిరిపైనే ఉడకనివ్వాలి.
కొద్దిసేపటి తరువాత తగినన్ని నీళ్ళను పోసి కూరను బాగా ఉడికించాలి. గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేలా, నూనె పైకి తేలేలా కూర ఉడికిన తరువాత దానికి చింతపండు రసాన్ని కలిపి కొద్దిసేపటి తరువాత కొత్తిమీరను చల్లి దించేసి వేడి వేడిగా అతిథులకు వడ్డించాలి. ఇది చపాతీ, ఫ్రైడ్ రైస్, వేడి వేడి అన్నం, వెజిటబుల్ రైస్, నేతి అన్నం లాంటి వాటికి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.