క్యాప్సికమ్ దోసెను ఎలా చేయాలి?
, బుధవారం, 16 జనవరి 2013 (17:52 IST)
క్యాప్సికమ్‌తో వెరైటీ వంటకాలు తయారు చేసుకోవచ్చు. పిజ్జాల్లో ఉపయోగించే క్యాప్సికమ్‌ను మీరు ఇంట్లో తయారు చేసే దోసెల్లో ట్రై చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. అలాంటి క్యాప్సికమ్ దోసెను ఎలా తయారు చేయాలంటే..?కావలసిన పదార్థాలు :క్యాప్సికమ్ ముక్కలు : అరకప్పుమొక్కజొన్నపిండి : పావుకప్పు. మిరియాల పొడి : అరస్పూను. ఉప్పు : తగినంత.వెన్న : అరకప్పు. కోడిగుడ్లు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) : రెండు. ఉల్లిపాయలు ముక్కలు : అరకప్పు తయారీ విధానం: ముందుగా క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలు పొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత వెన్నను పెనంపై వేసి కరిగించి, మిక్సీలో రుబ్బిన మిశ్రమంతో అట్టులా వేసుకోవాలి. ఈ అట్టుల్ని సన్నని సెగపై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండువైపులా కాల్చాలి. తర్వాత చిల్లీ సాస్, టమోటా సాస్ లేదా గ్రీన్ చట్నీ వంటి సైడిష్‌తో వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు.