Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోస్తా స్పెషల్ "ఆగాకరకాయ వేపుడు"

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
ఆగాకరకాయలు.. పావు కేజీ
ఉల్లిపాయలు.. రెండు
పసుపు.. పావు టీ.
కారం.. ఒక టీ.
మెంతిపొడి.. పావు టీ.
గరంమసాలా.. పావు టీ.
పంచదార.. పావు టీ.
నూనె.. సరిపడా
ఉప్పు.. తగినంత
జీలకర్ర, ఆవాలు, శనగపప్పు.. ఒక టీ.
కరివేపాకు.. 2 రెమ్మలు

తయారీ విధానం :
ఒక పాత్రలో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆగాకరకాయ ముక్కల్ని వేసి, పైన పంచదార చల్లి పదినిమిషాలపాటు వేయించాలి. మరో పాత్రలో ఒకటిన్నర టీస్పూన్ల నూనెవేసి వేడయ్యాక ఉల్లిపాయల్ని వేసి వేయించి దించేయాలి. చల్లారిన తరువాత ఉల్లిపాయలను మెత్తగా నూరుకోవాలి.

అదే పాత్రలో సరిపడా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయల పేస్ట్, పసుపు వేసి నాలుగు నిమిషాలపాటు వేయించాలి. దీంట్లోనే కారం, మెంతిపొడి, గరంమసాలా, ఉప్పు కలపాలి. చివరగా వేయించిన ఆగాకరకాయ ముక్కల్ని పోపులో వేసి సన్నటి మంటపై ఇరవై నిమిషాలపాటు వేగనిచ్చి, తర్వాత దించేయాలి. అంతే ఆగాకరకాయ వేపుడు సిద్ధం..!

Share this Story:

Follow Webdunia telugu