కేరళ వాసులకు ప్రీతిపాత్రం "వెజ్ అవియల్"
కావలసిన పదార్థాలు :మునక్కాడలు.. ఒక కప్పుఅరటిముక్కలు.. ఒక కప్పుబూడిదగుమ్మడి ముక్కలు.. ఒక కప్పుగోరుచిక్కుడు ముక్కలు.. ఒక కప్పుకందముక్కలు.. ఒక కప్పుకొబ్బరితురుము.. ఒక కప్పుకొత్తిమీర తరుగు.. రెండు కప్పులుపెరుగు.. ఒక కప్పుపచ్చిమిర్చి.. పదికొబ్బరినూనె.. 2 టీ.ఉప్పు.. తగినంతతయారీ విధానం :కూరగాయ ముక్కలన్నింటినీ ఉడికించి ఉంచాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికించిన కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి స్టౌమీద ఉంచాలి. నీరంతా ఇగిరిపోయాక ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. మిశ్రమం దగ్గరయ్యేంతదాకా అలాగే ఉడికించి.. కొబ్బరినూనె వేసి బాగా కలియదిప్పి దించేయాలి. అంతే కేరళ ప్రజలు చాలా ఇష్టంగా తినే వెజ్ అవియల్ రెడీ..!