Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలీఫ్లవర్‌ పులుపు కూర

Advertiesment
వంటకాలు భారతీయ కాలీఫ్లవర్ చింతపండు పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఎండుమిర్చి సెనగపప్పు జీలకర్ర కరివేపాకు ఆవాలు నూనె
, గురువారం, 8 జనవరి 2009 (18:19 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్‌... ఒకటి
చింతపండు... నిమ్మకాయంత
పచ్చిమిర్చి... నాలుగు
ఉప్పు... తగినంత
పసుపు... చిటికెడు
ఎండు మిర్చి... నాలుగు
ఆవాలు... అర టీస్పూను
మినప్పప్పు.. ఒక టీస్పూను
సెనగపప్పు... ఒక టీస్పూను
జీలకర్ర... పావు టీస్పూను
కరివేపాకు... సరిపడా
నూనె... మూడు టీస్పూన్లు
కొత్తిమీర... సరిపడా

తయారీ విధానం :
కాలీఫ్లవర్‌ను చిన్న ముక్కలుగా తరిగి, వేడి నీటితో కడగాలి. తరువాత వీటికి ఉప్పు, పసుపు, చింతపండు రసం కలుపుకుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి మరిగాక ఆవాలు, ఎండు మిర్చి, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పులతో పోపు పెట్టుకోవాలి. నూరి ఉంచుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర ముద్దను కూడా పోపుకు కలుపుకోవాలి.

ఈ పోపులోనే ముందే ఉడికించి ఉంచుకున్న కాలీఫ్లవర్‌ను వేసి, ఉప్పును సరిజూసుకుని, ఎర్రగా వేగిన తర్వాత దించేయాలి. కూర దించిన తర్వాత చింతపండు రసం లేదా, నిమ్మరసాన్ని కలుపుకోవాలి. (చింతపండు అందుబాటులో లేకపోతే నిమ్మరసంతో కూడా చేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu