కావలసిన పదార్థాలు:
చింతపండు, ఉప్పు: చెరో స్పూన్
కాప్సికమ్: పావు కిలో
ఇంగువ: చిటికెడు
జీలకర్ర: రెండు స్పూన్లు
నూనె: 25 గ్రాములు
తయారీవిధానం:
తురిమిన కాప్సికమ్ ముక్కల్ని నూనెలో బాగా వేయించండి. వేరొక బాణలిలో నూనెను పోసి ధనియాలు, మెంతులు, మినపపప్పు వేసి వేయించుకోండి. వీటిలో పోపు, ఎండుమిరప కాయలు, పచ్చిమిరపకాయల్ని కూడా కలిపి వేయించండి. ఈ మిశ్రమాన్ని కాప్సికమ్లను రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోండి. మెదిగిన తర్వాత చింతపండు వేసి బాగా కలిసేలా నూరుకోండి. కాప్సికమ్ పచ్చడి రెడీ..